మేము పుట్టిన గ్రామానికి చేతనైనంత సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. నిరుపేద బాలికల విద్యను ప్రోత్సహించడానికి గ్రామంలో వసతి గృహాన్ని దత్తత తీసుకుని వారికి అవసరమైన దుస్తులు ఉచితంగా అందజేస్తున్నాం. నాతో పాటు మరో ఇద్దరు స్నేహితులం సంయుక్తంగా విశాఖ సంపూర్ణ సంస్థ ద్వారా నెలకు రూ. 30 వేలు విలువ గల పేడ్ కాటన్ దుస్తులు ప్రతి నెలా అందిస్తున్నాం. ఇతర పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు కూడా అవసరమైన సామగ్రి అందజేయనున్నాం. అలాగే గ్రామాభివృద్ధికి కూడా మా వంతు సాయం అందించడానికి కృషి చేస్తాం. – రత్నకుమారి, ఎన్‌ఆర్‌ఐ