నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్
ఐపీఎల్
ప్రాక్టీస్ సెషన్‌లో
ఎల్‌ఎస్‌జీ జట్టు
విశాఖకు క్రికెట్ పండగ వచ్చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు నగరం సర్వం సిద్ధమైంది. రాష్ట్రానికి ఫ్రాంచైజీ లేకపోయినా.. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టు వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంను తమ రెండో హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకుంది. ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంలో సోమవారం రాత్రి 7.30 గంటలకు లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. గత సీజన్లలో విశాఖ వేదికగా ఆరు ఫ్రాంచైజీ జట్లు ఆడగా, లక్నో సూపర్ జెయింట్స్‌కు మాత్రం ఇదే తొలి మ్యాచ్. మ్యాచ్ ప్రీ సెషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం తమ ప్రణాళికగా చెప్పారు. దీనిని బట్టి చూస్తే టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి విశాఖ క్రికెట్ అభిమానులు ఈ ఉత్కంఠభరితమైన పోరు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
– విశాఖ స్పోర్ట్స్
అల్లిపురం: పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్సార్ వీసీఏ–ఏడీసీఏ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగే క్రికెట్ మ్యాచ్‌కు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గాజువాక, పాత బస్టాండ్, సింహాచలం, కూర్మన్నపాలెం నుంచి సుమారు 30 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా బస్సుల పెంపు, తగ్గింపు ఉంటుందన్నారు. పోలీసు శాఖ ఆదేశాలతో విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే బస్సులను సాయంత్రం 5 గంటల తర్వాత హనుమంతువాక నుంచి బీచ్‌రోడ్డు వైపు మళ్లిస్తామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
ఐపీఎల్ మ్యాచ్‌కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
జోష్
జోష్
జోష్