దేవరాపల్లి : జీడి పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించడంతో పాటు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని గిరిజనులు, రైతులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి తామరబ్బ, చింతలపూడి, వాలాబు, గరిశింగి, చినగంగవరం తదిత ర గ్రామాల నుంచి గిరిజన రైతులు కదం తొ క్కా రు. పేదలు సాగులో ఉన్న పోడు, ఫారెస్టు భూ ములకు పట్టాలు ఇవ్వాలని, గతంలో పట్టాలు ఇ చ్చిన వారందరికీ ఆన్‌లైన్ చేయాలని, జీడి పిక్కలకు కిలోకు రూ. 200 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న, మండల కార్యదర్శి బి.టి.దొర మాట్లాడుతూ జీడి పంటను ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
వరి, చెరకు తదితర పంటల మాదిరిగా మద్దతు ధర ప్రకటించక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పంట దిగుబడి సమయంలో వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని, వ్యాపారులు చేతిలోకి వెళ్లగానే ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, జీడి పంట విస్తరణకు గతంలో ఇచ్చిన రాయితీలను పునరుద్ధరించాలని కోరారు. ఈ మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సిహెచ్.చినదేముడు, టి.శంకర్, ఎం.ఎర్రునాయుడు, జె.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గిట్టుబాటు కల్పించి, ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేయాలి
తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనుల నిరసన