నాతవరం : ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సామగ్రి సక్రమంగా సకాలంలోఅందేలా పర్యవేక్షించడమే మా బాధ్యత అని విద్యాశాఖ తనిఖీ బృందం సభ్యుడు జిల్లా కోఆర్టినేటరు సిహెచ్.దేవరాయులు అన్నారు. మండలంలో మంగళవారం కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం వంటకాలను స్వయంగా పరిశీలించి నాణ్యతను రూచి చూశారు. తర్వాత విద్యార్థినులకు అందించే శానిటరీ నాప్‌కిన్స్ ఏవిధంగా అందిస్తున్నారు.. అడిగి తెలుసుకున్నారు. నాతవరం హైస్కూల్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అక్కడ పరిస్థితులపై విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం మెనూ విషయంలో నిర్లక్ష్యం చేయరాదని హెచ్‌ఎం రవిశంకర్‌కు సూచించారు. కార్యక్రమంలో జీసీడీవో పద్మ, జిల్లా తనిఖీ బృందం సభ్యులు అచ్యుతరావు, బి.ప్రసాద్, ఎంఈవో కామిరెడ్డి వరహాలబాబు కస్తూర్బా ప్రత్యేకాధికారి భవానీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.