హర్షతేజను అప్పగిస్తున్న పోలీసులు
మాకవరపాలెం: కనిపించకుండా పోయిన బాలుడిని పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. గాజువాకకు చెందిన హర్షతేజ (14) తామరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చదువుపై విరక్తితో ఈ నెల 22న పాఠశాల నుంచి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆదేశాలతో పోలీసులు మూడు టీంలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో బుధవారం హర్షతేజను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పటించినట్టు ఎస్‌ఐ దామోదర్‌నాయుడు తెలిపారు.