దేవరాపల్లి: దేవరాపల్లి ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను గురువారం పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, డీఎల్‌డీవో ఎస్. మంజులవాణి వెల్లడించారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు నడుమ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్నిక నిర్వహించే ఎంపీడీవో కార్యాలయం వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలులో ఉంటుందన్నారు. గతంలో కేటాయించిన బీసీ మహిళ రిజర్వేషన్ మేరకు ఎంపీపీ ఎన్నిక జరుగుతుందన్నారు. ఉదయం 11 గంటలకు ముందుగా ఎంపీపీ పదవికి పోటీ చేసే అభ్యర్థులను ఆయా పార్టీలకు చెందిన సభ్యులు బలపరుస్తారన్నారు. అనంతరం చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఎన్నిక ప్రక్రియ ముగిసిన అనంతరం గెలుపొందిన సదరు ఎంపీపీకి ధ్రువీకరణ పత్రం అందజేయడంతో పాటు వెంటనే ప్రమాణ స్వీకారం కూడా చేయిస్తామన్నారు.
సీసీ కెమెరాల నిఘా, పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నిక నేడు
ఉదయం 11 గంటలకు చేతులు ఎత్తే పద్ధతిలో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ
ఎన్నిక అనంతరం ధ్రువీకరణ పత్రం అందజేత, ప్రమాణ స్వీకారం
ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, డీఎల్‌డీవో మంజులవాణి వెల్లడి
దేవరాపల్లి ఎంపీపీ ఎన్నికకు పక్కాగా ఏర్పాట్లు