● డీఆర్‌డీఏ పీడీ శశీదేవి
సమావేశంలో మాట్లాడుతున్న పీడీ శశీదేవి
నక్కపల్లి : డ్వాక్రాసంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ చేసే అవకాశాలను అందిపుచ్చుకోవాలని డీఆర్‌డీఏ పీడీ శశీదేవి అన్నారు. గురువారం నక్కపల్లి వెలుగు కార్యాలయంలో నక్కపల్లి, పాయకరావుపేట, ఎలమంచిలి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాలకు చెందిన మహిళా సమాఖ్యలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్వాక్రాసంఘాలు చీరలు, వస్త్రాలు, హస్తకళా వస్తువులు, పచ్చళ్లు, స్వీట్లు తినుబండారాలు, సౌందర్యం, అలంకరణ, గృహోపకరణాలు వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారన్నారు. వీటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్లాట్‌ఫారంల ద్వారా విక్రయించి ప్రజలకు చేరువ చేయడంలో మండల సమాఖ్యలు కీలక పాత్రపోషించాలన్నారు. జిల్లాలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఈనెల 8న రూ.15.46 లక్షల విలువైన 10441 వస్తువులు విక్రయించేలా లక్ష్యం నిర్ణయించారన్నారు. వెలుగు ఏపీవో శ్రీనివాస్, సెంచురియన్ యూనివర్సీటీ ప్రొఫెసర్ అనిల్, డీపీఎం వరప్రసాద్, సత్యవేణి పాల్గొన్నారు.