అనకాపల్లి : స్థానిక గాంధీ కూరగాయల మార్కెట్లో గురువారం 24 డేస్ అనే సినిమా షూటింగ్ జరిగింది. మార్కెట్ సందడిగా మారింది. సిరి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎన్ని శ్రీనివాస్ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. రచయిత, దర్శకుడు కిరణ్ వారియర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు కిరణ్‌కు ఇది రెండవ చిత్రం గత ఏడాది మెగాస్టార్ ఫ్యాన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. నవంబర్ 29న చిత్రం రిలీజై విజయవంతంగా నడిచింది. ప్రస్తుతం గాంధీ మార్కెట్లో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 27 డేస్ సినిమాలో నూతన నటి నటులతో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్ని రోహిత్, జీవన్, సందీప్, కాశీరాం, లోవరాజు ఐదుగురు హీరోలు నటించగా హీరోయిన్ గా సోనమ్ నటిస్తున్నారు . చిత్రం ఆద్యంతం హరర్ర్ కామెడీ నేపథ్యంలో సాగుతుందని మే 24న దర్శకుడు కిరణ్ వారియర్ విడుదల చేయడం జరుగుతుందన్నారు.