
మాజీ జెడ్పీటీసీ మృతికి సంతాపం
మాకవరపాలెం: అనారోగ్యంతో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రుత్తల శేషుకుమార్ (47) మృతి చెందారు. మండల కేంద్రంలో నివసిస్తున్న శేషుకుమార్ గత కొంత కాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి విశాఖలో మృతి చెందారు. శేషుకుమార్ మాకవరపాలెం సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా, ఉప సర్పంచ్‌గా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా శేషుకుమార్‌ను ప్రకటించింది. ఆ పదవి పొందకుండానే మృతి చెందారు. ఆయన మృతదేహానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్, నర్సీపట్నం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు, ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు నివాళులర్పించి సంతాపం తెలియజేశారు. పార్టీలకతీతంగా మండలవ్యాప్తంగా భారీఎత్తున జనం తరలి వచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.