
పింఛన్ల పంపిణీ ప్రారంభం
గొలుగొండ/పరవాడ: జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీని మంగళవారం ఉదయం ప్రారంభించారు. గొలుగొండ మండలం గుండిపాల గ్రామంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెన్షన్లను పంపిణీ చేశారు. పరవాడ మండలం వాడచీపురుపల్లి గ్రామంలో కలెక్టర్ విజయ కృష్ణన్ లబ్ధిదారులకు పింఛన్ అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ పింఛన్ల కోసం ఎవరైనా లంచం అడుగుతున్నారా? అవకతవకలేమైనా ఉన్నాయా? అని ఆరా తీశారు. అనంతరం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 89 మంది వ్యాపారులకు తడి, పొడి చెత్త బుట్టలను ప్రత్యేక అధికారి గిరిషా అందించారు.

పింఛన్ల పంపిణీ ప్రారంభం