
అవిశ్వాసం వీగిపోతుంది
● జీవీఎంసీలో కూటమికి బలం లేదు ● అయినా అవిశ్వాసం పెట్టేందుకు కుట్రలు ● నిబంధనలకు అనుగుణంగా కలెక్టర్ వ్యవహరించాలి ● మరో ఏడాదిపాటు మేయర్‌గా హరివెంకటకుమారి కొనసాగుతారు ● మీడియాతో మాజీ మంత్రి అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్‌పై కూటమి పార్టీలు పెట్టిన అవిశ్వాసం వీగిపోనుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు. జీవీఎంసీలో కూటమి పార్టీలకు తగిన సంఖ్యాబలం లేకున్నా అవిశ్వాసం నోటీసులు ఇచ్చారని, దీనికి ఈ నెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానానికి తెరపడనుందన్నారు. మరో ఏడాది పాటు జీవీఎంసీ మేయర్‌గా హరి వెంకట కుమారినే కొనసాగనున్నారన్నారు. శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగకుండా తీర్మానం చేసినట్టు కార్పొరేటర్లకు ఎలా నోటీసులు ఇస్తారని కలెక్టర్‌ను ప్రశ్నించారు. అయితే ఈ ప్రక్రియలో నిబంధనలకు అనుగుణంగానే కలెక్టర్/ఇన్‌చార్జి జీవీఎంసీ కమిషనర్ హరేందిర ప్రసాద్ వ్యవహరించాలని సూచించారు. ప్రజాబలంతో నెగ్గి వైఎస్సార్‌సీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుందని, అలాంటి మేయర్‌పై కూటమి పార్టీలకు తగిన సంఖ్యా బలం లేకున్నా అప్రజాస్వామికంగా పెట్టే అవిశ్వాసానికి కుయుక్తులు పన్నుతోందన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా మా కార్పొరేటర్లు లొంగలేదు.. ఎందుకంటే అది జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానమని స్పష్టం చేశారు. ఇప్పటికే స్థానిక ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభాల కు గురిచేయాలని చూసినా అవి ఫలించలేదన్నారు.