
సిరులతల్లికి తులసిపూజ
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శనివారం తులసిపూజ నిర్వహించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు నిర్వహించిన ఈ పూజలో, అమ్మవారి త్రికాల పంచామృతాభిషేక సేవలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. తులసీదళార్చనలో పాల్గొనదలిచే భక్తులు రూ.1,500, త్రికాల పంచామృతాభిషేక సేవలో పాల్గొనే భక్తులు రూ.1,000 పూజా రుసుం చెల్లించి పాల్గొనవచ్చని ఆలయ ఈవో కె. శోభారాణి తెలిపారు. కార్యక్రమంలో ఈవో కె. శోభారాణి, ఏఈవో కె. తిరుమలేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.