
గంజాయితో ఐదుగురు అరెస్టు
అచ్యుతాపురం రూరల్: కొండకర్లలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అచ్యుతాపురం పోలీసులు ఆదివారం అదుపు లోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు సీఐ నమ్మి గణేష్ తెలిపారు. వీరిలో నలుగురు అచ్యుతాపురం మండలానికి చెందిన వారు కాగా మరొకరు అనకాపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చింతగుంట పవన్, పప్పల సాయి కుమార్, పోలవరపు వేణు, బెల్లంకొండ మహేంద్ర వర్మ, అప్పికొండ మణికంఠ బానులు వీరంతా మరో ప్రాంతం నుంచి గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ కొంత గంజాయి సేవించి మరికొంత నిల్వచేసారన్నారు. అందిన సమాచారం మేరకు సీఐ గణేష్, ఎస్‌ఐలు సుధాకర్, వెంకటరావు వారి సిబ్బందితో గంజాయి సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు.