
ఎస్పీ కార్యాలయానికి 42 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీఆర్‌జీఎస్‌కు 42 అర్జీలు అందాయి. అర్జీదారుల నుంచి ఎస్పీ తుహిన్ సిన్హా ఫిర్యాదులు స్వీకరించారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, ఎస్‌ఐ డి.వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
– విజయవాడ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని కోటవురట్ల మండలం అన్నవరానికి చెందిన నక్కా మాణిక్యాలరావు మోసం చేసినట్టు అదే మండలం ఎండపల్లికి చెందిన గుడివాడ వరలక్ష్మి, లింగాపల్లికి చెందిన గెడ్డమూరి వెంకటరావు, టెకు కుమార్ అనే దివ్యాంగులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నాగమణి రూ.10.50లక్షలు, టేకు కుమార్ నుంచి రూ.3 లక్షలు, గెడ్డమూర్తి వెంకటరావు నుంచి రూ.4లక్షలు 2021 ఏడాదిలో దఫదఫాలుగా చెల్లించామని వాపోయారు. కనీసం తమ నగదును తిరిగి ఇప్పించాలని బాధితులు వేడుకున్నారు. ఈ విషయంపై ఎస్పీ కోటవురట్ల సీఐతో ఫోన్‌లో మాట్లాడి నక్కా మాణిక్యాలరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.