
జాతీయ సెపక్ తక్రా పోటీలకు దేవరాపల్లి విద్యార్థి
దేవరాపల్లి: జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి తమటపు జశ్వంత్ ఎంపికయ్యాడు. ఈ నెల 15 నుంచి 20 వరకు మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో జశ్వంత్ పాల్గొంటాడని స్థానిక ప్రధానోపాధ్యాయుడు, ఇన్‌చార్జ్ ఎంఈవో బి.పడాల్‌దాస్ తెలిపారు. ఇటీవల కర్నూల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ బాలుడు విశేష ప్రతిభ కనబరిచి సత్తా చాటాడు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనగా కేవలం ఐదుగురు మాత్రమే ఎంపికయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి తమ పాఠశాల విద్యార్థి జశ్వంత్ ఒక్కరే ఎంపిక కావడం ఆనందంగా ఉందని పడాల్‌దాస్ చెప్పారు. జస్వంత్‌తోపాటు తర్ఫీదునిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు బాబూరావును గురువారం స్థానిక హైస్కూల్లో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.