
హోం మంత్రి హోమం
● అంతా రహస్యం
హోం మంత్రి అనిత ఇంటిలో నిర్వహిస్తున్న హోమం
సాక్షి, అనకాపల్లి: హోం మంత్రి పదవిలో కొనసాగడానికి, పాప దోషాలు పోవడానికి నక్కపల్లి మండలం సారికవానిపాలెం గ్రామంలో గల తన నివాసంలో హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం హోమం చేయించుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిపిన ఈ కార్యక్రమానికి అతి ముఖ్యలైన టీడీపీ నాయకులు హాజరైనట్టు సమాచారం. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగడం, మహిళలపై అఘాయిత్యాలు పెరగడంతో ఇటీవల ప్రభుత్వ పాలనపై ముఖ్యంగా హోం శాఖ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. హోమం జరిపించిన విషయాన్ని మంత్రి అత్యంత గోప్యంగా ఉంచారు.