
ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టం
నక్కపల్లి: తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టమని బైపీసీలో 982/1000 మార్కులు సాధించిన నక్కపల్లి కేజీబీవీ విద్యార్థిని పిరాది భవాని తెలిపింది. ఆమె స్వగ్రామం పాయకరావుపేట మండలం రాజవరం. తల్లిదండ్రులు నాగేశ్వరరావు, సుభద్ర మత్స్యకారులు. స్థానికంగా వేట సాగకపోవడంతో ఒరిశాలోని పూరీకి తాత్కాలికంగా వలస వెళ్లారు. భవాని ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు నక్కపల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో చదువుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాల ప్రిన్సిపాల్‌తోపాటు, ఉపాధ్యాయినులు చూపించిన ప్రత్యేక శ్రదద్ధ వల్లే తాను మంచి మార్కులు సాధించగలిగానని తెలిపింది. తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టమని డిగ్రీ చదివి బీఈడీ చేసి టీచర్‌ను అవుతానని తెలిపింది. ప్రస్తుతం పూరీలో ఉన్న ఆమె తల్లిదండ్రులు సాక్షితో మాట్లాడుతూ.. తమకు చదువు సంధ్యలు లేవని, ఇద్దరు పిల్లలను బాగా చదివించాలన్నదే తమ ఆశయమన్నారు.
బైపీసీ 9821000