ట్టడుగున నకాపల్లి | - | Sakshi
Sakshi News home page

ట్టడుగున నకాపల్లి

Apr 13 2025 2:19 AM | Updated on Apr 13 2025 2:19 AM

ట్టడుగున నకాపల్లి

ట్టడుగున నకాపల్లి

ఐఐటీ సాధించాలి..

యలమంచిలి రూరల్‌:

ఇంటర్‌లో జిల్లాకు ఆశించిన ఫలితాలు రాలేదు. రెగ్యులర్‌ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం నిరాశ కలిగించింది. రాష్ట్రంలో ప్రథమ సంవత్సరంలో 20వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 25వ స్థానం దక్కింది. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో ఇంటర్‌ ఫస్టియర్‌లో 62.62 శాతం, సెకండియర్‌లో 72.98 శాతంతో జిల్లా వెనుకంజలో ఉంది. మొదటి సంవత్సరంలో 10,279మంది జనరల్‌ విద్యార్థులు పరీక్షలు రాయగా 6437 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 9512 మంది పరీక్షలకు హాజరు కాగా 6942 మంది పాసయ్యారు. వొకేషనల్‌ సెకండియర్‌కు 2128 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1429 మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్‌ ఫస్టియర్‌లో 2174 మంది పరీక్షలు రాయగా 1217 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది ఇంటర్‌ ఫస్టియర్‌లో 52 శాతం, సెకండియర్‌లో 66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది స్వల్పంగా ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోల్చితే జిల్లా విద్యార్థులు రాణించలేకపోయారు. విద్యార్థుల జీవితాల్లో కీలకమైన ఇంటర్మీడియట్‌ ఫలితాలను పరిశీలిస్తే ఆశాజనకంగా లేకపోవడం కలవరపరుస్తోంది.

గతేడాది కంటే స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత శాతం

సత్తా చాటిన గురుకులాలు..

ప్రభుత్వ సెక్టార్‌లో ఉన్న వివిధ గురుకులాల విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటారు. ఒకటి రెండు మినహా మిగిలిన గురుకులాలు మెరుగైన ఫలితాలు సాధించాయి. ఫస్టియర్‌లో బీసీ రెసిడెన్షియల్‌ కాలేజీలు 95.36 శాతం, బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకులాలు 80 శాతం, కేజీబీవీలు 86.46 శాతం, మోడల్‌ స్కూళ్లు 80.06 శాతం ఉత్తీర్ణత సాధించాయి. సెకండియర్‌లో బీసీ రెసిడెన్షియల్‌ కళాశాలలు 95.48 శాతం, అంబేడ్కర్‌ గురుకులాలు 88 శాతం, కేజీబీవీలు 90.68 శాతం, మోడల్‌ స్కూళ్లు 91.29 శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకున్నాయి.

కేజీబీవీ విద్యార్థులు భళా

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ విద్యార్థులు ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇంటర్‌ రెండో సంవత్సరం బైపీసీలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న ఇద్దరూ కేజీబీవీలో చదివినవారే. తేగాడ కేజీబీవీ విద్యార్థి కంట్రెడ్డి రాజులమ్మ 983, నక్కపల్లి కేజీబీవీలో చదివిన పిరాది భవాని 982 మార్కులు సాధించారు. రైతు కుటుంబానికి చెందిన రోలుగుంట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ విద్యార్థిని మడ్డు గౌతమి ఎంపీసీలో 986 మార్కులు సాధించింది.

●ఎస్‌.రాయవరం కేజీబీవీలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. జూనియర్‌ ఇంటర్‌లో 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

●కోటవురట్ల కేజీబీవీలో సెకండియర్‌ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించగా ప్రథమ సంవత్సరంలో 96.4 శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

●యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కొక్కిరాపల్లి సాంఘిక సంక్షేమ గురుకులంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 92 శాతం ఉత్తీర్ణత దక్కింది.

ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు డీలా..

రూ.వేలకు వేలు ఫీజులు తీసుకుంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రైవేట్‌ కళాశాలలు ఫలితాల్లో డీలా పడ్దాయి. జిల్లాలో ప్రైవేటు కళాశాలలు మొదటి సంవత్సరంలో 64.96 శాతం, రెండో సంవత్సరంలో 73.76 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అన్ని సౌకర్యాలు కల్పించినా ప్రభుత్వ కళాశాలల్లో కూడా మెరుగైన ఫలితాలు రాలేదు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో ఫస్టియర్‌లో 43.74 శాతం, సెకండియర్‌లో 60.73 శాతం మాత్రమే ఉత్తీర్ణత వచ్చింది.

మే 12 నుంచి సప్లిమెంటరీ

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలను మే 28 వ తేదీ నుంచి జూన్‌ 1 వరకు జిల్లా కేంద్రంలో మాత్రమే నిర్వహిస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నెల 22వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి బి.సుజాత తెలిపారు. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌, జవాబు పత్రాల స్కానింగ్‌ కాపీ కోసం ఈనెల 13వ తేదీ నుంచి 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపీసీ 9861000

రోలుగుంట: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివి ఎంపీసీలో 986 మార్కులు సాధించిన మడ్డు గౌతమి సామాన్య రైతు కుటుంబానికి చెందిన బాలిక. తండ్రి లక్ష్మీనారాయణ వ్యవసాయ పనులు చేస్తారు. తల్లి వెంకటలక్ష్మి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కుక్‌గా చేస్తున్నారు. చదువుపై మక్కువ ఉన్న తమ కుమార్తెకు పెద్ద చదువులు చెప్పించాలన్నది వారి ఆశయం. గౌతమి ప్రథమ సంవత్సరంలో 470 కి 463 సాధించి టాపర్‌గా నిలిచింది. ఆరో తరగతి నుంచి పది వరకు కేజీబీవీలో చదువుకుంది. గౌతమి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఐఐటీ సాధించి, మంచి ఇంజినీరుగా రాణించాలన్నది తన ఆశయమని చెప్పింది. తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, తండ్రితోపాటు తన తల్లి కూడా వ్యవసాయ పనులు చేస్తూ ఎంతో శ్రమిస్తోందని తెలిపింది. అన్నయ్య మహేష్‌ సహకారం మరువలేనిదన్నారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌, అధ్యపక బృందం, ఎస్వో తులసి అందించిన సహకారంతోనే తాను ఇన్ని మార్కులు సాధించానని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement