
క్రిమినల్ కేసులు బనాయించి మరీ తొలగించారు..
కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే హోం మంత్రి అప్పటి డ్వామా పీడీ సందీప్‌పై ఒత్తిడి తెచ్చి, మాకు ఫోన్ చేయించి రాజీనామా చేయాలని చెప్పించారు. నేను అంగీకరించకపోవడంతో 16 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నాపై క్రిమినల్ కేసులు పెట్టి మరీ తొలగించారు. నాతో పాటు నామవరం, శ్రీరాంపురం ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా భయపెట్టి తప్పించారు. మిగతా వారిని నెల రోజుల తరువాత తొలగించారు. నిజంగా నేను తప్పు చేస్తే..అదే మస్తర్ షీటుపై సంతకాలు చేసే ఎంపీడీవో, క్వాలిటీ కంట్రోల్ అధికారి, ఏపీవో, డ్వామా పీడీ, టెక్నికల్ అసిస్టెంట్ అందరూ తప్పు చేసినట్లే. వారిని కూడా తొలగించాలి.
– మేకా సోమయ్య, ఫీల్డ్ అసిస్టెంట్, ఈదటం గ్రామం, పాయకరావుపేట నియోజకవర్గం
●