
వేట నిషేధ భృతి పంపిణీ
మత్స్యకారులకు చెక్కును అందజేస్తున్న మంత్రి అనిత, కలెక్టర్ విజయ కృష్ణన్
నక్కపల్లి:
గంగపుత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే నష్టపరిహారాన్ని శనివారం పంపిణీ చేశారు. నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అనిత, కలెక్టర్ విజయ కృష్ణన్ జిల్లాలోని 6 మండలాల్లో 12,544 మందికి సంబంధించిన రూ.25.288 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకార మహిళల కోసం అడ్డురోడ్డులో షెడ్డు నిర్మాణం, మత్స్యకార పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల నిర్మాణం జిల్లాకేంద్రంలో మత్స్యకారుల కసం రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.ఫిషరీస్ జేడీ ప్రసాద్, ఎంపీడీవో సీతారామరాజు, తహసీల్దార్ నర్సింహమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.