ఆగని చంద్రబాబు కుయుక్తులు
సూపర్‌సిక్స్ పథకాలు కావాలంటే ఫొటోలు దిగాలంటూ పట్టు
జనసమూహాల్లో చొరబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం
చీదరించుకుంటున్న ప్రజలు
రాయదుర్గం: ఈ ఎన్నికల్లోనూ ఓటమి తప్పదని తెలిసిన టీడీపీ చీప్ పాలి‘ట్రిక్స్’కు తెరతీసింది. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక దుశ్చర్యలకు పాల్పడుతోంది. సీఎం పీఠం కోసం ఏ అవకాశాన్నీ వదులుకోని చంద్రబాబు.. ఇప్పటికే ఎల్లో మీడియా ద్వారా విస్తృతంగా అబద్దాలు ప్రచారం చేయిస్తున్నారు. అయితే, ఎల్లో మీడియా దుష్ప్రచారం పనిచేయడం లేదని నిర్ధారించుకున్న ఆయన.. కొత్త విన్యాసాలు ప్రారంభించారు.
ఫొటో దిగితేనే పథకాలట..
అధికారం కోసం హామీలు ఇవ్వడం.. ఆ తర్వాత వాటిని తుంగలో తొక్కడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికల్లోనూ 650 హామీలిచ్చిన ఆయన.. అధికారం చేపట్టాక ఒక్కటీ నెరవేర్చక అందరికీ కుచ్చుటోపీ పెట్టారు. అయితే, మళ్లీ ఎన్నికలు రావడంతో ప్రజలను మరోసారి వంచించేందుకు ‘సూపర్‌సిక్స్’ పథకాలు అంటూ నాటకాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వీటిపై ప్రచారం కోసమంటూ ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపారు. జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్తున్న ఈ టీమలు.. పథకాలకు సంబంధించిన పేపర్ చేతిలో పెట్టి ఫొటో దిగాలంటూ బతిమాలుతున్నారు. తాము తీసే ఫొటో నేరుగా చంద్రబాబుకు చేరుతుందని, ఇప్పుడు ఫొటో తీసుకుంటేనే భవిష్యత్తులో పథకాలు అందుతాయంటూ మభ్య పెడుతున్నారు.
గుంపులుగా వెళ్తూ..
వీరికి తోడు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి మరికొన్ని బృందాలను కూడా చంద్రబాబు బరిలోకి దింపినట్లు తెలిసింది. గ్రామాలు, పట్టణాల్లో జన సమూహాల్లోకి చొరబడడం, ప్రభుత్వం, సీఎం జగన్‌పై వ్యతిరేకంగా మాట్లాడడమే వీరి పని. అయితే, టీడీపీ కుట్రలను గుర్తించిన ప్రజలు పలు చోట్ల ఈ పెయిడ్ గుంపులపై తిరగబడుతున్నట్లు తెలిసింది. చంద్రబాబు మాటలు నమ్మి మళ్లీ మోసపోయేందుకు తామేం పిచ్చోళ్లు కాదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ కొత్త కొత్త కుట్రలకు తెరలేపుతుండడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment