
●భలే రుచిగా ఉందే..
కూడేరు: మండల కేంద్రం కూడేరులో ప్రసిద్ధిగాంచిన శివపార్వతుల జోడు లింగాల ఆలయం వద్ద శనివారం ఓ రెండు వానరాలు గోడపైకి చేరాయి. అక్కడ ఆడుకునేందుకు వచ్చిన పిల్లల్లో ఒక చిన్నారి చేతిలో ఉన్న కూల్‌డ్రింక్ బాటిల్‌ను ఓ వానరం లాక్కుంది. అందులో ఏముందోనని వాసన చూసింది.
వెంటనే మరొక వానరం ఆ బాటిల్ వైపు ఆశతో చూడసాగింది. దీంతో మొదటి వానరం కూల్‌డ్రింక్ కాస్త తాగగానే రుచిగా అనిపించడంతో గుటగుటా లాగించేసింది. తర్వాత ఖాళీ బాటిల్ చూపగా.. పక్కనున్న వానరం నిరాశతో పక్కకు వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.
Comments
Please login to add a commentAdd a comment