
నేడు తాడిపత్రికి పెద్దారెడ్డి
● అలజడులు సృష్టించేందుకు జేసీ ప్రణాళిక!
సాక్షి టాస్క్‌ఫోర్స్: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి రానున్నారు. ఈ క్రమంలో పట్టణంలో అలజడులు సృష్టించేందుకు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రణాళికలు రచించినట్లు తెలిసింది. పట్టణానికి రావాలంటూ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులకు వాట్సాప్ మెసేజ్‌లు పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలకు తెరలేపారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రాకుండా అధికార అండతో అడ్డుకుంటున్నారు. అయితే,చాలా రోజుల తర్వాత ప్రజలను కలుసుకునేందుకు పెద్దారెడ్డి వస్తున్నా.. అలజడులు సృష్టించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధం కావడంపై పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయ ఉద్యోగుల సంఘం
జిల్లా కార్యవర్గం ఎన్నిక
అనంతపురం సిటీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు కె.హనుమంతు తెలిపారు. అనంతపురంలోని ఆ శాఖ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలపై చర్చించారు. అనంతరం కొత్త కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. సహాధ్యక్షుడిగా సాకే రామాంజనేయులు(నవోదయ కాలనీ), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శివ శంకరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఎం.సిద్ధేశ్వర్, వి.హనుమంతరెడ్డి, డి.నూర్‌బాషా, ఎ.బాలకృష్ణారెడ్డి, కె.జైనాబీ, ఎం. గణేష్, ఎన్.రాఘవేంద్ర ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా డి.నరసింహులు, ట్రెజరర్‌గా ఆర్.మహేష్ నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె.భగీరథరెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా ఎస్.దాదా ఖలందర్, కె.స్వాతి, ఎస్.రజిని, పీహెచ్ మంజునాథ, పి.ఆదినారాయణ,ఎ.జ్యోతి స్వరూప్, సీకే నరేష్, కార్యవర్గ సభ్యులుగా జి.అశోక్ రాజు, బి.మణిదీప్, డి.అహమ్మద్‌ను ఎన్నుకున్నారు.
పామిడి మండలలోని ఒక గ్రామంలో కానిస్టేబుల్ కుటుంబానికి రెండెకరాల పొలం ఉంది. దీన్ని సర్వే చేసేందుకు ఇటీవల కానిస్టేబుల్ గ్రామ సర్వేయర్ వద్దకు వెళ్లగా.. ఆయన రూ.10 వేలు వసూలు చేశాడు. పొలం పక్కనే తమకు 26 సెంట్ల స్థలం ఉందని, దాన్ని కూడా సర్వే చేయాలని కోరగా, సదరు సర్వేయర్ స్పందించలేదు. దీంతో కానిస్టేబుల్ ఆ శాఖ అధికారి ద్వారా సర్వేయర్‌కు ఫోన్ చేయించగా పొలం వద్దకు వచ్చి మళ్లీ రూ. 3 వేలు లాగి సర్వే చేశాడు. ఇదొక్కటే కాదు.. జిల్లావ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి.
గతంలో చాలా మంది సర్వేయర్లు లంచాలు తీసు కుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండల సర్వేయర్ వెంకటేశ్వర్లు ఓ రైతు పొలం సర్వే చేసేందుకు రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. ఓ రైతుకు చెందిన 7.5 ఎకరాల భూమి సర్వే చేసేందుకు ధర్మవరం మండల సర్వేయర్ చండ్రాయుడు రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతపురం నగర పాలక సంస్థకు ఫారిన్ సర్వీసెస్ కింద వెళ్లిన సర్వేయర్ కోటేశ్వరరావు ఓ స్థలాన్ని సర్వే చేసిన తరువాత అందుకు సంబంధించిన రిపోర్ట్ ఇచ్చేందుకు వ్యక్తి నుంచి ఏకంగా రూ.7 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తూ ఇలా ఎంతో మంది వలలో చిక్కుకున్నా ఇప్పటికీ కొందరి తీరు మారకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం అర్బన్: సర్వే, భూ రికార్డుల శాఖకు చెందిన సర్వేయర్లు వసూల్ రాజాలుగా మారారు. లంచాలు పుచ్చుకోవడంలో మండల సర్వేయర్లను గ్రామ సర్వేయర్లు మించిపోయారు. కొందరు గ్రామ సర్వేయర్లు ముక్కుపిండి డబ్బులు దండుకుంటున్నారు. కొలతలు వేయాలంటే.. చేతిలో కాసులు పడా ల్సిందే. లేదంటే భూ యజమానికి చుక్కలు చూపిస్తూ ముప్పు తిప్పలు పెడుతున్నారు.
సర్వే చేయాలని స్వయంగా శాఖ ఉన్నతాధికారులు ఫోన్ చేసి చెప్పినా... ‘మాది మాకు ఇవ్వాల్సిందే’ అంటూ వసూలు చేస్తున్నారు. ‘‘మేము ఎవరి మాట వినం, ఈ విషయంలో తగ్గేదేలే’’ అనే రీతిలో రెచ్చిపోతుతున్నారు. గతంలో మండల సర్వేయర్లదే పెత్తనం ఉండేది. గ్రామ సర్వేయర్ల వ్యవస్థ రావడంతో వారి ప్రభ తగ్గింది. గ్రామంలో భూమి లేదా స్థలం సర్వే చేయాలన్నా వీరిని సంప్రదించాల్సి వస్తోంది. ఇదే అదునుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
భూముల సర్వే సర్వేయర్లకు కాసుల పంట కురిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వే కోసం ‘మీ సేవ’లో చలానా కట్టి దరఖాస్తు చేసుకుంటే 45 రోజుల్లోపు సమస్య పరిష్కరించాలి. అయితే సర్వేయర్లు నిర్ణీత వ్యవధిలో సర్వే చేయకుండా ప్రజలను తిప్పుకోవడం... చేతులు తడిపిన తరువాత సర్వే చేయడం సర్వసాధారణంగా మారింది. వివాదాస్పద స్థలాల సర్వే చేయాల్సి వస్తే వీరి దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇలాంటి వ్యవహారాల్లో అవకాశం దొరికితే దరఖాస్తుదారుడిని పిండేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. డిమాండ్ చేసినంత మొత్తం ఇవ్వకపోతే అతని ప్రత్యర్థితో లాలూచీ పడి అర్జీదారునికి నష్టం కలిగేలా రిపోర్ట్ ఇస్తున్నారనే విమర్శలున్నాయి.
మారని తీరు..
గ్రామ సర్వేయర్ల వసూళ్ల దందా
ఉన్నతాధికారులు చెప్పినా
లెక్కచేయని వైనం
ముడుపులివ్వకపోతే
తప్పని తిప్పలు
ఫిర్యాదు చేయండి
భూములు, స్థలాలు సర్వే చేసేందుకు, సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు ఎవరైనా సర్వేయర్లు డబ్బులు డిమాండ్ చేస్తే బాధితులు నేరుగా మాకు ఫిర్యాదు చేయవచ్చు. అవినీతికి పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటాం.
– రూప్లానాయక్, అసిస్టెంట్ డైరెక్టర్,
సర్వే, భూరికార్డుల శాఖ
కాసుల పంట..
మాది మాకు ఇవ్వాల్సిందే..

నేడు తాడిపత్రికి పెద్దారెడ్డి

నేడు తాడిపత్రికి పెద్దారెడ్డి

నేడు తాడిపత్రికి పెద్దారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment