హంద్రీ–నీవా కాలువ పనులు వేగవంతం చేస్తాం
కళ్యాణదుర్గం: జిల్లాలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలవ పనులు, ఇతర అంశాలపై ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ సీఈ, ఎస్‌ఈ, ఈఈలు, ఏఈలతో కలెక్టర్ సమీక్షించారు. హంద్రీనీవా కాలువ పనులు చేపట్టిన రెండేళ్ల లోపు పూర్తి చేయాలన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ 36బీ, 36సీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీపీ వరకూ కాలువ పనులు చేపట్టే అంశాన్ని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. నేమకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కి సంబంధించి ఏజెన్సీ నుంచి డీపీఆర్ అందాల్సి ఉందన్నారు. అంతకు ముందు రీ సర్వే పనులపై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ వసంతబాబు, సివిల్ సప్లయీస్ డీఎం రమేష్‌రెడ్డి, సర్వే ఏడీ రూప్లానాయక్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ సీఈ నాగరాజ, ఎస్‌ఈ రాజా స్వరూప్‌కుమార్, గుంతకల్లు ఈఈ శ్రీనివాసనాయక్, డీఈలు విశ్వనాథ్, రమణ, వెంకటరమణ, ఏఈలు దాదాఖలందర్, నాగభూషణం, భాస్కర్, నాగరాజు, పీజీఆర్‌ఎస్ తహసీల్దార్ వాణిశ్రీ,, డివిజన్ మండలాల తహసీల్దార్లు, డీటీలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
2 లోపు మోడల్ సర్వే పూర్తి చేయాలి
కళ్యాణదుర్గం రూరల్: మోడల్ సర్వేను మార్చి 2వ తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం కళ్యాణదుర్గంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి జీఎస్‌డబ్ల్యూఎస్, పీ–4 మోడల్ సర్వేపై జెడ్పీ సీఈఓ, డీపీఓ, డీఎల్‌డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలన్నారు. వివిధ రకాల సేవలకు సంబంధించిన సర్వీసుల మొత్తాన్ని రెండు రోజుల్లోపు ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలన్నారు.
కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment