‘వాసుకి’పై విహారం.. ఆదిదంపతుల అనుగ్రహం
తాడిపత్రి రూరల్: బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు పార్వతీదేవి సమేతంగా వాసుకి వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ముందుగా బుగ్గ ఆలయంలో మూల విరాట్‌లకు అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను విశేషంగా అలకరించి వాసుకి వాహనంపై పుర వీధుల్లో ఊరేగించారు. భక్తులు టెంకాయలు కొట్టి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
నేడు గ్రూప్–2 మెయిన్స్
అనంతపుర అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష ఆదివారం జరగనుంది. 14 కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 7,293 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు కో–ఆర్డినేటింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ నేతృత్వంలో 14 మంది లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు.
గంట ముందే చేరుకోవాలి..
పరీక్ష సమయానికి గంట ముందే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలి. పేపర్–1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్–2 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. ఉదయం పరీక్షకు 9.45 గంటల తరువాత, మధ్యాహ్నం పరీక్షకు 2.45 తరువాత అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించరు.
Comments
Please login to add a commentAdd a comment