అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా సమన్వయకర్త కె.జయలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఏజీసెట్–25 ప్రవేశ పరీక్ష ద్వారా (ఇంగ్లిష్ మీడియం) ఎంపిక చేస్తామని వెల్లడించారు. మార్చి 6లోగా https:// apbragcet. apcfss. in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 6వ తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్ ప్రవేశ పరీక్ష అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment