పెట్రోల్ బంకులపై విజి‘లెన్స్’
గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని హెచ్‌పీ, పారిశ్రామికవాడలోని ఐఓసీ పెట్రోల్ బంకుల్లో శనివారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, తూనికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల క్రితం అనంతపురంలోని ఓ పెట్రోల్ బంకులో చిప్‌ను అమర్చి మోసం చేస్తున్న ఉదంతం వెలుగుచూసింది. ఈ నేపథ్యంలోనే జిల్లా విజిలెన్స్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజిలెన్స్ సీఐ సద్గురుడు, తూనికలు కొలతల శాఖ అధికారి శంకర్ పర్యవేక్షణలో టెక్నికల్ సిబ్బంది పెట్రోల్, డీజిల్ పంప్‌లను ఓపెన్ చేసి చూశారు.
కృత్రిమ కాలి కోసం పేర్లు నమోదు చేసుకోండి
అనంతపురం రూరల్: వికలాంగులు కృత్రిమ కాలు కోసం పేర్లు నమోదు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్ తెలిపారు. మార్చి1 లోపు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. రూ. 51 వేల విలువ చేసే ఆధునిక వెయిట్‌లెస్ కృత్రిమ కాలిని మార్చి రెండో వారంలో అందిస్తామ న్నారు. 8639081464, 9110353497, 08554– 232380 నంబర్లలో సంప్రదించాలన్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment