భక్త జనసంద్రమైన ‘కోన క్షేత్రం’
యాడికి: మహాశివరాత్రి సందర్భంగా యాడికి మండలం కోనుప్పలపాడు సమీపంలోని కోన క్షేత్రంలో వెలసిన రామలింగేశ్వరుడి రథోత్సవం గురువారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. జిల్లా వాసులతో పాటు నంద్యాల జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కోన క్షేత్రం కిక్కిరిసింది. గ్రామ పెద్దలు రామాంజనేయులు, రామకృష్ణ, పంచాయతీ అధికారులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఆలయ అర్చకుడు జంగం రాజశేఖరయ్య ఆధ్వర్యంలో శివపార్వతుల ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టింపజేసి, మర్రిమాను చివరి వరకు లాగారు. కాగా, గురువారం వేకువజామున ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అలాగే శివరాత్రి సందర్భంగా యాడికి మండల వ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు జాగారణతో మొక్కులు తీర్చుకున్నారు. యాడికిలోని బైరవేశ్వర ఆలయంలో శివపార్వతుల ఉత్సవ మూర్తులకు ఎంపీపీ బొంబాయి ఉమాదేవి, బొంబాయి రమేష్ నాయుడు కల్యాణం జరిపించారు.
భక్త జనసంద్రమైన ‘కోన క్షేత్రం’
Comments
Please login to add a commentAdd a comment