బరితెగింపు రాజకీయాలకు నిదర్శనం
అనంతపురం కార్పొరేషన్: సినీనటుడు, రచయిత పోసాని మురళీ అరెస్టు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బరితెగింపు రాజకీయాలకు అద్దం పడుతోందని ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు నెలల కిత్రమే తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు పోసాని బహిరంగంగానే ప్రకటించినా ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్టు చేయించిందన్నారు. సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సెక్షన్ 111 సెక్ష వర్తించదని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సైతం పట్టించుకోకుండా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో చాలా మందిపై ఈ సెక్షన్ నమోదు చేసి బెయిల్ రాకుండా కుతంత్రాలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్‌పైనా కేసు నమోదు చేయడం చూస్తే ఎమర్జెన్సీ పాలన గుర్తుకొస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అందులో భాగంగా లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డిపై కన్‌సెషన్ స్టేట్‌మెంట్ ఆధారం చేసుకుని అక్రమ కేసు బనాయించారన్నారు. ఇటువంటి కేసులకు తాము భయపడమని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment