రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసాని అరెస్ట్
రాప్తాడురూరల్: నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగానే సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇచ్చిన నోటీసును పరిశీలిస్తే...ఎంత కక్షసాధింపు చర్యలనేది అర్థమవుతుందన్నారు. రేపటి తేదీతో నోటీసు ఇచ్చి ఈరోజే అరెస్ట్ చేసి తీసుకెళ్లారన్నారు. ఇలాంటి పోలీసులు దేశంలోనే చంద్రబాబు ప్రభుత్వంలో తప్ప ఎక్కడా ఉండరన్నారు. పాలసీ మీద పోసాని కృష్ణమురళి విమర్శలు చేశారు తప్ప ఏరోజూ పరిధికి మించి మాట్లాడలేదన్నారు. చంద్రబాబు తప్పిదాలనే ఆయన విమర్శించారన్నారు. అలాంటి వ్యక్తిపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేసేందుకే అధికారాన్ని ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లతో రాష్ట్రానికి ఒరిగేదేమీలేదన్నారు. ‘ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీ నాయకులను, సోషల్ మీడియాను అణిచివేసేందుకు ఒక తీర్మానం చేయాలని చెప్పారు. ఇందులో భాగంగానే పోసాని అరెస్ట్‌కు కుట్ర జరిగింది’ అని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే తో పుదుర్తి ప్రకాష్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment