చంద్రబాబు నిజ స్వరూపం ఇదే
అనంతపురం ఎడ్యుకేషన్: ‘పేదలపై సీఎం చంద్రబాబుకు ఉన్న వైఖరి మరోసారి బయటపడింది. ఆయన నిజస్వరూపం ఇదే’ అంటూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భయం, పక్షపాతం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలందరికీ న్యాయం చేస్తానని శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన చంద్రబాబు... ఈ రోజు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కాని ఎలాంటి పనులు చేయబోమంటూ తెగేసి చెపుతుండడం దుర్మార్గమన్నారు. ఇప్పటి వరకూ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎంతోకొంత జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. అయితే ప్రజలతో కాకుండా జనసేన, బీజేపీ, ఈవీఎంఓలతో పొత్తు పెట్టుకుని గెలిచిన చంద్రబాబుకు ప్రజలంటే లెక్కలేని తనమని, అందుకే ప్రజలను ధిక్కరించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి అందక 9 నెలలుగా నిరుద్యోగులు నానా పాట్లు పడుతున్నా ప్రభుత్వంలో కనీస స్పందన కూడా లేదన్నారు. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు ప్రతినెలా రూ.1,500 ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్లు ఇస్తామని చెప్పి బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కులం, మతం, పార్టీలను ఏనాడూ జగనన్న చూడలేదన్నారు. కేవలం పేదరికం ప్రామాణికంగా చేసుకుని అందరికీ సంక్షేమ ఫలాలు అందజేశారన్నారు. జగన్ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మారుస్తున్నారంటూ నాడు మొసలి కన్నీరు కార్చిన చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్నదేమిటో చెప్పాలన్నారు. 2023–24లో జగనన్న రూ.79 వేల కోట్లు అప్పులు తెస్తే.. 2024–25కు గాను రూ.98వేల కోట్ల అప్పులు తీసుకురావాలని చెప్పి రూ.1.31 లక్షల కోట్ల అప్పులను చంద్రబాబు తీసుకువచ్చారని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.14 లక్షల కోట్లు అప్పులు తీసుకురావాలని చెప్పి రూ.1.50 లక్షల కోట్లు తెస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపి సంక్షేమ పథకాలకు ఎగనామం పెడుతున్నారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకానికి రూ. 12 వేల కోట్లు అవసరం కాగా రూ. 9,400 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని, అన్నదాత సుఖీభవకు రూ. 12 వేల కోట్లు అవసరం కాగా రూ. 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. అరకొర నిధుల కేటాయింపులు చూస్తుంటే సగానికి పైగా లబ్ధిదారులను మోసం చేసే కుట్ర బహిర్గతమవుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలెవరూ కూటమి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడడం లేదన్నారు. తామంతా జగనన్న వెంటే ఉంటామని, జనంతోనే ఉంటామని, కాదూకూడదని జైల్లో పెట్టినా సంతోషంగా అక్కడే ఉంటామన్నారు. ఈ నిరంకుశ పాలనకు త్వరలో చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో మీనుగ నాగరాజు, ఆత్మకూరు వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, నవీన్ పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి
ఎగనామం పెట్టనున్నారు
వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా కుట్ర
ఇందులో భాగంగానే ప్రజలను
ఽధిక్కరించి మాట్లాడుతున్నారు
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment