జూదరుల అరెస్ట్
తాడిపత్రి రూరల్: మండలంలోని చుక్కలూరు సమీపంలో పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.60 వేలు నగదు, 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు. అందిన సమాచారం మేరకు పట్టణ, రూరల్ ఎస్‌ఐలు గౌస్, ధరణీబాబులు సిబ్బందితో కలసి ఆదివారం తనిఖీలు చేపట్టి జూదరులను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
పట్టపగలే ఎలుగుబంటి
సంచారం
రాయదుర్గం టౌన్: స్థానిక గ్యాస్ గోదాము ప్రాంతంలోని కురాకుల గుట్ట వద్ద పట్టపగలే ఎలుగుబంటి సంచారంతో కాలనీ వాసులు బెంబేలెత్తిపోయారు. ఆదివారం సాయంత్రం ఓ ఎలుగుబంటి కురాకులగుట్ట వైపు నుంచి జాతీయ రహదారి బ్రిడ్జిని దాటింది. రోడ్డుపై వెళుతున్న ఎలుగుబంటిని కొందరు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీసి వైరల్ చేశారు. రెండు రోజులుగా ఈ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు.
తొలి పూజలందుకున్న
పోతలయ్య స్వామి
కనగానపల్లి: మండలంలోని దాదులూరు గ్రామంలో పోతలయ్య స్వామి జాతర ఆదివారం భక్తుల కోలాహలం మధ్య ప్రారంభమైంది. తొలి రోజు వేకువజామునే గంతిమర్రి, కలికివాండ్లపల్లి గ్రామాల నుంచి భక్తులు ఎలవగంపలో స్వామి ఆభరణాలు, పూలను ఊరేగింపుగా తీసుకు వచ్చారు. ఆలయంలో విశేష పూజల అనంతరం మూలవిరాట్‌ను ఆభరణాలతో అలంకరించారు. అలాగే చెన్నకేశవస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేసి స్వామి కాపులు దాసంగాలు (పంక్తి భోజనాలు) నిర్వహించారు.
నేడు జ్యోతుల మహోత్సవం: జాతరలో భాగంగా సోమవారం పోతలయ్య స్వామికి జ్యోతుల మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. కీలకమైన గావుల మహోత్సవాన్ని మంగళవారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జూదరుల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment