జనరల్ సర్జరీ పీజీ ఫలితాల్లో సత్తా
అనంతపురం ఎడ్యుకేషన్: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీ మెడికల్ పరీక్షల ఫలితాల్లో ‘అనంత’ వాసి డాక్టర్ విష్ణుశ్రీకర్‌రెడ్డి 800 మార్కులకు గాను 613 మార్కులు సాధించి రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచారు. మూడు రోజుల క్రితం ఫలితాలు విడుదలయ్యాయి. డాక్టర్ విష్ణుశ్రీకర్‌రెడ్డి ప్రస్తుతం కర్నూలు మెడికల్ కళాశాలలో పీజీ జనరల్ సర్జరీ చేస్తున్నారు. ఆయన తండ్రి డి.జనార్దన్‌రెడ్డి గతంలో అనంతపురం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేశారు. తల్లి జయశ్రీదేవి గృహిణి. వీరి సొంతూరు కణేకల్లు కాగా ప్రస్తుతం అనంతపురం నగరంలో నివాసం ఉంటున్నారు. ఈ సందర్భంగా విష్ణుశ్రీకర్‌రెడ్డిని డాక్టర్ లక్ష్మణ ప్రసాద్, డాక్టర్ కొండయ్య, డాక్టర్ రఘువంశీ, డాక్టర్ సింధూర, డాక్టర్ శంకర్ గౌడ్, జయరామ రెడ్డి, రాయదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment