శింగనమల: ప్రభుత్వ అనుమతులు రసాయనిక మందులు, బయో ఫర్టిలైజర్, ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఎరువుల దుకాణాల నిర్వాహకులను గుత్తి ఏడీఏ వెంకట్రాముడు హెచ్చరించారు. శింగనమల మండలం తరిమెల, కల్లుమడి గ్రామాల్లోని భైర వ ఫర్టిలైజర్, నిత్యశ్రీ ఆగ్రో ఏజెన్సీ ఎరువుల దుకాణాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనుమతులు లేకుండా అమ్మకం సాగిస్తున్న రూ.3,65,309 విలువైన బయో ఫర్టిలైజర్స్ ఎరువులను గుర్తించి, వాటి విక్రయాలను నిలపుదల చేస్తూ నోటీసులు జారీ చేశారు.అనంతరం రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అన్వేష్‌కుమార్, రైతు సేవా కేంద్రాల సిబ్బంది నవీన్, ఆదినారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment