‘పోలీసు స్పందన’కు 72 వినతులు
అనంతపురం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 72 వినతులు అందాయి. ఎస్పీ పి.జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, సమస్య తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. చట్టపరిధిలోని సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి, మహిళా పీఎస్‌డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషా పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు
ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన
అనంతపురం అగ్రికల్చర్: కంప్యూటర్ పరిజ్ఞానంపై నిరుద్యోగ యువతీయువకులకు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో 60 రోజుల ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు ఆ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 20 నుంచి 35 సంవత్సరాల వయస్సున్న ఇంటర్, డిప్లొమా పాస్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన వారు అర్హులన్నారు. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీసు, లైఫ్ స్కిల్స్, వర్క్‌ప్లేస్ ఎథిక్స్, బేసిక్ స్పోకెన్ ఇంగ్లిషు, కస్టమర్ రిలేషన్‌షిప్ స్కిల్స్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 73969 50345లో సంప్రదించాలని సూచించారు.
విద్యార్థులను
చితకబాదిన హెచ్‌ఎం
● ఇంటి వద్ద తల్లిదండ్రుల ఆందోళన
కణేకల్లు: స్థానిక లిటిల్ ఏంజిల్స్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసులు సతీమణి, ఆ పాఠశాల హెచ్‌ఎం భారతి అకారణంగా విద్యార్థులను చితకబాదారు. వివరాలు... సోమవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో పలువురు విద్యార్థులు క్లాస్ టీచర్ బాబు అనుమతితో బయటికెళ్లి తిరిగొచ్చారు. ఎవరి అనుమతితో వెళ్లారంటూ 8వ తరగతి విద్యార్థి వినయ్‌కుమార్, ధనుష్, దిలీప్, షాహిల్‌ను హెచ్‌ఎం భారతి నిలదీశారు. ఆ సమయంలో వారిచ్చిన సమాధానంతో మరింత ఆగ్రహానికి లోనై చేతికి అందుబాటులో ఉన్న స్టీల్ పైప్ తీసుకుని చితకబాదారు. స్టడీ అవర్స్ తర్వాత ఇంటికెళ్లిన విద్యార్థులు జరిగిన ఘటనను తెలపడంతో సోమవారం రాత్రి స్కూల్ కరస్పాండెంట్ ఇంటి వద్ద బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. అకారణంగా విద్యార్థులను చితకబాదిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు.
‘పోలీసు స్పందన’కు 72 వినతులు
Comments
Please login to add a commentAdd a comment