అపంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలల పునర్వ్యవస్థీకరణ (స్కూల్స్ రీఆర్గనైజేషన్) పేరుతో కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా ప్రాథమిక విద్య కనుమరుగయ్యే ప్రమాదం నెలకొందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ (వైఎస్సార్‌టీఏ) నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అనంతపురంలోని ఉపాధ్యాయ భవనంలో వైఎస్సార్‌టీఏ జిల్లా నాయకుల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఉపాధ్యాయ, విద్యారంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు పేరుతో ప్రైమరీ స్కూల్స్ మూతకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలతో ప్రాథమిక విద్య కుంటుపడే ప్రమాదం ఉందని వాపోయారు. అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు సంబంధించి ఆర్థికపరమైన సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిటీని వేసి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, ఉపాధ్యాయులకు దక్కాల్సిన పీఎఫ్ లోన్లు. ఏపీజీఎల్‌ఐ లోన్లు, క్లెయిమ్స్ వెంటనే పరిష్కారించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌టీఏ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్, నాయకులు రామకృష్ణ, రాష్ట్ర నాయకులు వెంకటరమణప్ప, గోపాల్, రవీంద్రారెడ్డి, ప్రసాద్, కృష్ణానాయక్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌టీఏ నాయకుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment