●పాతవే ముద్దు.. కొత్తవి వద్దు
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖ పరిధిలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన నూతన భవనాలు వృథాగా మారాయి. అన్ని వసతులతో నిర్మించిన పెద్ద పెద్ద భవనాల్లో ఒకరిద్దరు పనిచేస్తుండగా పాతబడిన భవనంలోనే పూర్తి స్థాయి సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండడం గమనార్హం. ఖాళీగా ఉన్న కొత్త భవనాల్లో కృత్రిమ గర్భోత్పత్తికి సంబంధించిన సామగ్రితో పాటు కొన్ని మందులు పెడుతున్నారు. ఇదీ పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయ ప్రాంగణంలోని భవనాల దుస్థితి.
జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) ఆధ్వర్యంలో రూ.70 లక్షలు వెచ్చించి అధునాతన వసతులతో నిర్మించిన అతిపెద్ద భవనంలో డీఎల్‌డీఏ ఈఓ, ఓ డాక్టర్, మరొక సిబ్బంది... కేవలం ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన గదులు, హాలు నాలుగైదు సంవత్సరాలుగా వృథాగా ఉన్నాయి.
ఐదేళ్ల క్రితం రూ.72 లక్షలతో గొర్రెల అభివృద్ధి విభాగం కింద నిర్మించిన ఈ అతి పెద్ద భవనంలో ఒక్కరు కూడా విధులు నిర్వర్తించడం లేదు. నిర్వహణ లేకపోవడంతో గోడలు నెర్రెలు బారాయి. బాత్‌రూంలు కంపుకొడుతున్నాయి.
దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ పాత భవనంలోనే జేడీతో పాటు ఏడీలు, డాక్టర్లు, ఇతర కార్యాలయ మినిస్టీరియల్ స్టాఫ్ 25 మంది వరకు పనిచేస్తున్నారు. ఈ పాత భవనాల పైకప్పులు రాలి పడుతుంటాయి. గోడలు నెర్రెలు బారాయి. వానొస్తే భవనం కారుతుంది. అయినా అందులోనే విధులు నిర్వర్తిస్తున్నారు.
జేడీ కార్యాలయ ఆవరణలోనే డీడీ కార్యాలయ భవనమూ నిర్మించారు. ఇందులోనూ డీడీ, ఏడీతో పాటు కార్యాలయ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడే 50 ఏళ్ల కిందట నిర్మించిన మరో భవనం రేపోమాపో కూలిపోయే స్థితిలో ఉంది. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నా ఈ భవనంలో కృత్రిమ గర్భోత్పత్తి మందులు, క్యాన్లు, ఇతర సామగ్రి డంప్ చేశారు.
●పాతవే ముద్దు.. కొత్తవి వద్దు
●పాతవే ముద్దు.. కొత్తవి వద్దు
●పాతవే ముద్దు.. కొత్తవి వద్దు
Comments
Please login to add a commentAdd a comment