ఆటో బోల్తా – డ్రైవర్ దుర్మరణం
శింగనమల: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... శింగనమల మండలం ఆనందరావుపేటకు చెందిన వీరనారాయణ(56)కు భార్య, ఓ కుమారుడు, కుమారై ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మంగళవారం ఉదయం అదే గ్రామానికి చెందిన సంజప్ప, రమేష్... వీరనారాయణ ఆటోను అద్దెకు మాట్లాడుకుని పామిడి గ్రామానికి వెళ్లి ఐస్‌క్రీమ్‌లు కొనుగోలు చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో కల్లుమడి వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఘటనలో వీరనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. సంజప్ప, రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
చేపల వలలో చిక్కిన
మృతశిశువు
శింగనమల: చేపల కోసం వేసిన వలలో ఓ పసికందు మృతదేహం చిక్కింది. ఇంకా అవయవాలు పూర్తిగా ఏర్పడని ఓ పసికందు (మగ) మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి శింగనమల చెరువు చిన్న కాలువలో పడేశారు. మంగళవారం ఉదయం శింగనమలకు చెందిన మత్స్యకారులు కొందరు విసుర వలతో చిన్న కాలువలో చేపలు పడుతున్న సమయంలో అందులోకి చేపలతో పాటు ప్లాస్టిక్ కవరు చిక్కింది. ప్లాస్టిక్ కవర్‌ను విప్పి చూసిన మత్స్యకారులు ఒక్కసారిగా విస్తుపోయారు. 6– నెలల గర్భస్థ సమయంలోనే ప్రసవం జరిగి శిశువు మృతిచెందాడా? లేదా అబార్షన్ చేయించుకుని పోతూ శిశువు మృతదేహాన్ని కాలువలో పడిసి వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఆటో బోల్తా – డ్రైవర్ దుర్మరణం
ఆటో బోల్తా – డ్రైవర్ దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment