‘పీఎం సూర్యఘర్’ వేగవంతం కావాలి
అనంతపురం టౌన్: జిల్లాలో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం అమలు వేగవంతం కావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం విద్యుత్ కార్యాలయంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 46 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. అన్నింటినీ గ్రౌండింగ్ చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సోలార్ రూఫ్ టాప్‌ల ఏర్పాటుకు అవసరమైన పరికరాలను వెండర్స్ సిద్ధం చేసుకునేలా చూడాలన్నారు. ఎంపీ అంబికా మాట్లాడుతూ ‘పీఎం సూర్యఘర్’ అమలులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషాద్రిశేఖర్, ఈఈలు జేవీ రమేష్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
‘ఎంఎస్‌ఎంఈ’లకు భూమి కేటాయించండి
అనంతపురం అర్బన్: ‘ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన భూమి కేటాయింపు ప్రక్రియను చేపట్టండి’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్, డీఆర్‌ఓ, జిల్లా రిజిస్ట్రార్, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, ఆర్‌ఎస్‌డీటీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ–సేవ, ఆధార్ సీడింగ్, అడంగల్ కరెక్షన్, మ్యుటేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment