చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
రమేష్ గౌడ్
అనంతపురం కార్పొరేషన్: సీఎం చంద్రబాబు నాయుడుపై రాజద్రోహం కింద కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల చిత్తూరు పర్యటనలో చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లేనని వ్యాఖ్యానించడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. సీఎంగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు దిగుజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజల పట్ల వివక్ష చూపడం ఎంత వరకు న్యాయమన్నారు. సీఎం అనే వ్యక్తి అందరినీ సమాన ధోరణితో చూడాలని.. కేవలం కొన్ని పార్టీలకు మాత్రమే పథకాలు ఇవ్వాలని మాట్లాడటం దారుణమన్నారు. మంత్రి లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అధికారులు, నాయకులపై పోలీసులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని.. రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌కు ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెబుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment