అనంతపురం: ‘గతంలో అప్కాస్ ద్వారా మీకు జీతాలు చెల్లించేవారు. ఇటీవల ఆ వ్యవస్థను రద్దు చేయడంతో నేరుగా వర్సిటీనే చెల్లించాల్సి వస్తోంది. దీంతో తలకు మించిన భారం అవుతోంది. ఈ క్రమంలోనే కొంత మందిని తొలగించక తప్పదు’ అని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జేఎన్‌టీయూ(ఏ) రిజిస్ట్రార్ కృష్ణయ్య స్పష్టం చేశారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో గురువారం జేఎన్‌టీయూ నూతన వీసీ సుదర్శనరావును సత్కరించారు. ఈ సందర్భంగా వీసీ సమక్షంలోనే రిజిస్ట్రార్ కృష్ణయ్య అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలు సింహభాగం అటానమస్‌గా మారిపోతున్నాయన్నారు. దీంతో వర్సిటీకి ఆదాయం గణనీయంగా తగ్గిపోతోందని, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపు కష్టతరంగా మారిందని చెప్పారు. కొంత మందిని తొలగించక తప్పదన్నారు. ఆసక్తి ఉన్న వారు అనంతపురం నుంచి కలికిరి ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లొచ్చని, అక్కడ క్వార్టర్స్ సౌకర్యం కూడా ఉందన్నారు. కొంత మంది ఒక సెక్షన్ నుంచి మరొక సెక్షన్‌కు మారిస్తేనే నేరుగా ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఫోన్ చేయించి సిఫార్సు చేస్తున్నారన్నారు. ఫింగర్‌ప్రింట్ పెట్టి విధులకు హాజరు కాకుండా వెళ్లిపోతున్నారని, అలాంటి వారిపై నిఘా ఉంచామన్నారు.ఇప్పటికే 9 మందిని తొలగించామని, భవిష్యత్తులో మరింత మందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment