డీఎంఎల్‌టీలో స్టేట్ టాపర్‌గా కావ్య
అనంతపురం మెడికల్: ఇటీవల జరిగిన డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పరీక్ష అనంతపురం వైద్యకళాశాలలోని పారామెడికల్ కోర్సు విద్యార్థిని కావ్య... రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన పరీక్షల్లో 480 మార్కులకు గానూ 87.77 శాతంతో 416 మార్కులు సాధించింది. విద్యార్థిని ప్రతిభను గుర్తించిన మెడికల్ కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు గురువారం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థిని మంచి మార్కులు సాధించం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ షంషాద్‌బేగం, డాక్టర్ షారోన్, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment