సాక్షి, టాస్క్‌ఫోర్స్: ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ‘బెల్టు షాపు’ చిచ్చును టీడీపీ నేతలు రాజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ‘వీధికోటి... సందుకోటి’ చొప్పున బెల్టుషాపులు వెలిశాయి. తమ అనునూయులకు ఆదాయం చేకూర్చడమే లక్ష్యంగా కూటమి నేతలు గ్రామాల్లో బెల్టుషాపులు పెట్టించారు. ఈ నేపథ్యంలో ‘బెల్టు షాపు’ నిర్వహణ అంశంలో స్థానిక టీడీపీ నేత తీసుకెళ్లిన ఒత్తిడి ఆ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది.
న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధితుడు
కణేకల్లు మండలం బెణికల్లు గ్రామంలో టీడీపీ నేత, మాజీ ఎంపీటీసీ ఎర్రిస్వామి తమ పార్టీ కార్యకర్త జీవనోపాధి కోసం బెల్టుషాపు పెట్టించారు. గత పది రోజులుగా బెల్టు షాపు ద్వారా ఆశించిన మేర వ్యాపారం జరగలేదు. దీంతో ఆదాయం తగ్గింది. ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్త సదరు నేత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్‌డీపీఎల్ (నాన్ డ్యూటీఫైడ్ లిక్కర్) అమ్మడం వల్లే బెల్టు షాపులో అమ్మకాలు తగ్గాయని, ఇందుకు కారకుడైన అదే గ్రామానికి చెందిన వన్నూరు స్వామిని అరెస్ట్ చేయాలంటూ ఎకై ్సజ్ సీఐ ఉమాబాయిపై ఒత్తిళ్లు తీసుకెళ్లాడు. దీంతో బుధవారం సాయంత్రం తన సిబ్బందితో కలసి సీఐ వన్నూరుస్వామి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ ఎలాంటి మద్యం దొరకలేదు. ఇదే విషయాన్ని సదరు టీడీపీ నేతకు ఆమె ఫోన్ చేసి తెలిపారు. అయితే ఎలాగైనా వన్నూరుస్వామిపై కేసు బనాయించి గ్రామంలో బెల్టుషాపు సజావుగా జరిగేలా చూడాల్సిందేనంటూ ఆయన హుకుం జారీ చేయడంతో వన్నూరు స్వామిని స్టేషన్‌కు తరలించి చితకబాది కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు ఒప్పించేలా చేశారు. ఈ మొత్తం వ్యవహారం ఎందుకు చేయాల్సి వచ్చిందో కాసేపటి తర్వాత వన్నూరుస్వామి కుటుంబసభ్యులకు ఓ అధికారి తెలిపారు. దీంతో అదే రోజు రాత్రి గ్రామానికి చేరుకున్న వన్పూరుస్వామి కుటుంబసభ్యులు నేరుగా ఎర్రిస్వామి ఇంటికెళ్లి తప్పుడు కేసు ఎందుకు పెట్టించావంటూ నిలదీశారు. తాను చెప్పినట్లు వినకపోతే ఏమైనా చేస్తామంటూ ఆ సమయంలో ఎర్రిస్వామి రెచ్చిపోవడమే కాక తన వర్గీయులతో దాడులకు తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా తనపై వన్నూరుస్వామి, ఆయన తండ్రి మల్లికార్జున, తల్లి లింగమ్మ, కుటుంబసభ్యులు అనిత, భూలక్ష్మి, చిన్న వండ్రయ్య దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చావుదెబ్బలు తిన్న తల్లి లింగమ్మ ఫిర్యాదను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఘటనపై వన్నూరు స్వామి మాట్లాడుతూ... తనను స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టి కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు అక్రమంగా కేసు నమోదు చేశారని, అంతేకాక తన కుటుంబసభ్యులపై దాడి చేసి చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై న్యాయపోరాటం సాగిస్తానని పేర్కొన్నారు.
బెల్ట్ షాప్‌లో ఆదాయం తగ్గిందంటూ వ్యక్తిపై టీడీపీ నేత కుట్ర
కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లుగా కేసు నమోదు చేయాలంటూ ఎకై ్సజ్ అధికారులకు హుకుం
వాస్తవాలు గుర్తించకుండా పట్టుకెళ్లిన ఎకై ్సజ్ పోలీసులు
గ్రామంలో ఇరువర్గాల ఘర్షణ.. ఏకపక్ష దాడులతో ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment