No Headline
ప్రకాశం జిల్లా పామర్రు గ్రామానికి చెందిన భోగ్యం కృష్ణయ్య, పద్మావతి దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెల్లో లక్ష్మీప్రసన్న ఒకరు. వారిని పెంచడానికి తండ్రి పడ్డ కష్టాన్ని ఆమె కళ్లారా చూశారు. ఉన్నత చదువులు చదివి ఒక స్థాయికి చేరుకుని బాలికలకు అండగా ఉండాలని భావించారు. పీజీ కోర్సు పూర్తవగానే లక్ష్మీప్రసన్న ఐసీడీఎస్‌లో సీడీపీఓగా ఉద్యోగం సాధించారు. తాను అనుకున్న లక్ష్యం నెరవేరిందని చాలా సంతోష పడ్డారు. ప్రకాశం జిల్లాలో ఎనిమిదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత కళ్యాణదుర్గం సీడీపీఓగా వచ్చారు. విధి నిర్వహణలో భాగంగా పలు చోట్ల బాల్య వివాహాలను అరికట్టగలిగారు. లింగ వివక్ష లేకుండా చైతన్యవంతులను చేశారు. భ్రూణహత్యలు జరగకుండా వైద్య సిబ్బందితో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె సేవలను గుర్తించి 2020లో మహాత్మ జ్యోతిరావు పూలే ఫౌండేషన్ వారు తిరుపతిలో లక్ష్మీప్రసన్నకు ‘సావిత్రి బాయి ఫూలే ఎక్సలెన్స్’ అవార్డు అందజేశారు. ఈ అవార్డు ఆమెలో బాధ్యతను మరింత పెంచింది. – కళ్యాణదుర్గం:
బాలికల కోసం పనిచేయాలని...
Comments
Please login to add a commentAdd a comment