తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోండి
అనంతపురం అర్బన్: ‘మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను కలిపి మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తారు. ఈ విషయంపై పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలి. గతంలో చదివిన పాఠశాల కావాలా లేక మోడల్ ప్రైమరీ స్కూల్ కావాలా ఆరా తీయాలి’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో విద్య, అనుబంధ శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్ అంశంపై ఎంఈఓలు గ్రామపంచాయతీ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ విధానాలను వివరించాలన్నారు. అక్కడ తీసుకున్న నిర్ణయాలను లిఖితపూర్వకంగా ఆమోదం పొందేలా చూడాలన్నారు. మండల, క్లస్టర్ కమిటీల ఏర్పాటు, పాఠశాల నిర్వహణ కమిటీతో సంప్రదించి తల్లిదండ్రుల అంగీకారంతో పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఇబ్బందులున్న ప్రాంతాల్లో బేసిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని, మూడు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలలు లేనిచోట ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. రవాణా సదుపాయం లేని ప్రాంతాల్లో ఆ సౌకర్యం కల్పించాలన్నారు. సమస్యలను ప్రజాప్రతినిధులు, డిప్యూటీ డీఈఓ, డీఈఓ స్థాయిలో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల పునర్వ్యస్థీకరణలో భాగంగా యూడైస్ డేటా ప్రకారం పోస్టుల కేటాయించాలన్నారు. సమావేశంలో డీఈఓ ప్రసాద్‌బాబు, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ శైలజ, గిరిజిన సంక్షేమ అధికారి రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా టాప్–6లో ఉండాలి
పంచాయతీ సెక్ట్, జీఎస్‌డబ్ల్యూఎస్ తదితర అంశాల్లో జిల్లా టాప్–6లో ఉండేలా పనిచేయాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహంచారు. త్వరలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉంటుందని, అప్పటిలోగా రాష్ట్రస్థాయిలో ఆయా అంశాల్లో జిల్లాను టాప్–6లో ఉంచేందుకు కృషి చేయకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కలెక్టర్ వినోద్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment