●గాలేరు–నగరి ద్వారా కుప్పంకు నీరు తీసుకెళ్లొచ్చు ●జిల్ల
కూడేరు: ఉమ్మడి అనంత జిల్లా రైతులపై సీఎం చంద్రబాబు కక్షకట్టి హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. గ్రావిటీ ద్వారా కుప్పం ప్రాంతానికి గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను తీసుకెళ్లే అవకాశమున్నా... కాదనీ జిల్లా రైతాంగం సంక్షేమాన్ని కూటమి సర్కార్ కాలరాస్తోందన్నారు. మంగళవారం కూడేరులోని శివరావు కల్యాణమంటపం వేదికగా హంద్రీ–నీవా కాలువ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుడు, ఎంపీపీ నారాయణ రెడ్డి అధ్యక్షతన ‘రైతు సదస్సు’ జరిగింది. సదస్సులో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు స్వార్థానికి జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. గత ప్రభుత్వంలో గాలేరు–నగరి ద్వారా కుప్పం ప్రాంతానికి నీరందించేందుకు అప్పటి సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకుని 75 శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. మిగిలిన పనులు పూర్తి చేస్తే జగన్‌కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులకు టెండర్లు పిలిచారన్నారు. సుమారు రూ.736 కోట్లతో పూర్తయ్యే లైనింగ్ పనులకు రూ.200 కోట్లు అధికంగా పెంచి టెండర్లను తన అనుయాయులకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ పనులు పూర్తయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రీ–నీవా కాలువ ద్వారా 3.5లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం నీరుగారిపోతుందన్నారు. లైనింగ్ పనులతో కాలువ గుండా ప్రవహిస్తున్న నీరు భూమిలోకి ఇంకదన్నారు. పక్కలకు ఊట రాదన్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీటి లభ్యత పూర్తిగా తగ్గి పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేసుకునే రైతులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. భూములు బీళ్లుగా మారుతాయన్నారు. భవిష్యత్‌లో కాలువ వెడల్పు చేయడానికి అవకాశముండదన్నారు. లైనింగ్ పనులు ఆపాలని రైతులే వేడుకుంటున్నా... ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం దుర్మార్గమన్నారు. కుప్పం ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారానే నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే ముందుగా కాలువను వెడల్పు చేస్తే ఉమ్మడి అనంత జిల్లా రైతులు స్వాగతిస్తారన్నారు. జిల్లా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికై న లైనింగ్ పనులు ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు, అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమణ, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, వైఎస్సార్‌సీపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్ధార్థ, మండల అఽధ్యక్షుడు సిద్ధారెడ్డి, ఏపీ రైతు సంఘం మండల నేతలు నారాయణరెడ్డి, వీరప్ప, వెఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నేతలు రామచంద్రారెడ్డి, రంగారెడ్డి, రామ్మోహన్, క్రిష్టప్ప, గంగాధర్, నరేష్, కేశన్న తదితరులు పాల్గొన్నారు.
ఆత్మహత్యలే
శరణ్యం
హంద్రీ నీవా కాలువకు కాంక్రీట్‌తో లైనింగ్ పనులు పూర్తయితే ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని రైతులు, రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సదస్సులో జయపురం, ఎంఎంహళ్లి, చోళసముద్రం, పి.నారాయణపురం, తిమ్మాపురం, కరుట్లపల్లితో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. హంద్రీ నీవా కాలువ పరిధిలో రూ.లక్షల్లో పెట్టుబడితో వివిధ రకాల పంటలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నామన్నారు. కాలువకు లైనింగ్ పనులు చేపడితే భూగర్భ జలాలు అడుగంటి పోయి బోరు బావులో నీటి మట్టం తగ్గి పంటలు సాగు చేసుకోలేక నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ ప్రభుత్వం తమకు మేలు చేయకపోయిన పర్వాలేదని, నష్టం కల్గించే చర్యలు చేపట్టకుండా ఉంటే చాలన్నారు. హంద్రీ–నీవా కాలువ పరిరక్షణకు కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు.
●గాలేరు–నగరి ద్వారా కుప్పంకు నీరు తీసుకెళ్లొచ్చు ●జిల్ల
●గాలేరు–నగరి ద్వారా కుప్పంకు నీరు తీసుకెళ్లొచ్చు ●జిల్ల
Comments
Please login to add a commentAdd a comment