గరుడ వాహనంపై ఖాద్రీశుడు
కదిరి: కాటమరాయుడి బ్రహ్మోత్సవాలు కమనీయంగా సాగుతున్నాయి. పదో రోజైన మంగళవారం రాత్రి ఖాద్రీశుడు మరోసారి గరుడారూఢుడై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ ఉత్సవంలో ముందు రోజు తిరువీధుల్లో ఊరేగిన శ్రీవారు సాయంత్రానికి తిరిగి ఆలయం చేరుకున్నారు. నిత్యపూజలు, గ్రామోత్సవం అనంతరం రాత్రి సమయంలో గరుడవాహనంపై ఆలయ ప్రాంగణంలో కొలువుదీరారు. విశేషాలంకరణ ముగిసిన వెంటనే స్వామి వారికి ప్రధాన అర్చకులు దివ్య మంగళ హారతినిచ్చారు. అప్పటికే రాజగోపురం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకుని తరించారు. తర్వాత స్వామి వారు తిరువీధుల్లో విహరించారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మ ప్రజల కోరిక మేరకు తన ఇష్ట వాహనమైన గరుత్మంతుడిని నారసింహునికి వాహనంగా పంపుతారు. దీన్నే ప్రజా గరుడసేవ..మలి గరుడసేవ అని కూడా అంటారు.
గరుడ వాహనంపై ఖాద్రీశుడు
Comments
Please login to add a commentAdd a comment