మ్యూజియం సందర్శనకు విద్యార్థులు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘సైన్స్ ఎక్స్‌పోజర్’లో భాగంగా జిల్లా నుంచి పలువురు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు బెంగళూరు నగరంలోని విశ్వేశ్వరయ్య మ్యూజియం సందర్శనకు బయలుదేరారు. జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌తో పాటు వివిధ జిల్లాస్థాయి పోటీల్లో సత్తా చాటిన 8,9 తరగతుల బాలికలు 84 మంది, బాలురు 39 మంది వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులను గురువారం సాయంత్రం జిల్లా కేంద్రానికి పిలిపించారు. రాత్రి భోజన సదుపాయం కల్పించారు. బాలికలకు రుద్రంపేట సర్కిల్‌లోని వాల్మీకి కల్యాణమంటపం, బాలురకు ఉపాధ్యాయ భవనంలో వసతి కల్పించారు. సైన్స్ టూర్ వెళ్లేందుకు మొత్తం మూడు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరి తిరిగి శనివారం ఉదయానికి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. జిల్లా సైన్స్ అధికారి బాలమురళీకృష్ణ నేతృత్వంలో 18 మంది పురుష, మహిళా టీచర్లు ఎస్కార్ట్‌గా వెళ్తున్నారు. పిల్లలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ట్రైనీ కలెక్టర్ వినూత్న, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment