ఈ–కేవైసీ చేయించుకోండి
● రేషన్ కార్డుదారులకు జేసీ సూచన
అనంతపురం అర్బన్: రేషన్ కార్డులోని సభ్యులందరూ ఈనెల 31వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. ఇందుకు సంబంధించి వివరాలను గురువారం తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా 2,65,450 మంది సభ్యులు ఇప్పటికీ ఈ–కేవైసీ చేసుకోలేదన్నారు. ఈ–కేవైసీ చేయించుకున్నవారికి మాత్రమే ఏప్రిల్‌లో నిత్యావసర సరుకులు అందుతాయన్నారు. ఈ–కేవైసీ నమోదు కాని వారి జాబితా సంబంధిత ప్రాంత చౌకధరల దుకాణపు డీలరు, గ్రామ రెవెన్యూ అధికారి, సీఎస్‌డీటీ వద్ద ఉంటుందన్నారు. వారిని సంప్రదించి ఈ–పాసు యంత్రంలో వేలిముద్ర వేయాలన్నారు.
ఎంపీడీఓ కార్యాలయం..
ఎమ్మెల్యే తనయుడి దర్పం
పామిడి: కూటమి సర్కారులో వింత పోకడలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల కుటుంబీకులు, బంధువులు కూడా అనధికార ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అధికారులు కూడా స్వామి భక్తి ప్రదర్శిస్తూ జీ హుజూర్ అంటున్నారు. వివరాలు.. పామిడి పట్టణ ఎంపీడీఓ కార్యాలయానికి గురువారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మ నూరు జయరాం తనయుడు ఈశ్వర్ వచ్చారు. ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో చలి వేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఎంపీ డీఓ కార్యాలయంలోకి ప్రవేశించిన ఆయన.. అక్కడ ఎంపీడీఓ సీటులో ఆసీనులై దర్పం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ తేజోత్స్న, తహసీల్దార్ శ్రీధర్‌మూర్తి కనబరిచిన స్వామి భక్తి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment