
ఏళ్ల డిమాండ్‌ను నెరవేర్చారు
మరింత పెంచాలి
సంతోషం కలిగించింది
పదో తరగతి పరీక్షల నిర్వహణ, జవాబుపత్రాల మూల్యంకన విధుల నిర్వర్తించే సిబ్బందికి రెమ్యునరేషన్ దాదాపు పదేళ్ల తర్వాత గతేడాది పెంచడం చాలా సంతోషం. అంతకముందు అన్ని హోదాల సిబ్బందికి చాలా నామినల్‌గా రెమ్యునరేషన్ చెల్లించేవారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం రెమ్యునరేషన్ మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలి.
– డెగావత్ రవీంద్రనాథ్
గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
పదో తరగతి మూల్యాంకనం విధులకు హాజరయ్యే ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు చాలా తక్కువమొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించేవారు. గతేడాది ప్రభుత్వం ఆశాజనకంగా పెంచుతూ చర్యలు తీసుకోవడం చాలా సంతోషమేసింది. కష్టపడి పని చేస్తున్నా ఆశించిన స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో టీచర్లు చాలా అసంతృప్తిగా ఉండేవారు. స్పెషల్ అసిస్టెంట్లకు డీఏ సదుపాయం కల్పించాలి.
– కె.గోవిందరెడ్డి, వైఎస్సార్‌టీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
పదో తరగతి మూల్యాంకనం రేట్లు పెంచాలని అనేక సంవత్సరాలుగా ఉపాధ్యాయ సంఘాలు చేసిన డిమాండ్‌ను గతేడాది ప్రభుత్వం నెరవేర్చింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి మూల్యాంకనానికి హాజరవుతారు. వారం రోజులపాటు అనంతపురంలో ఉండాల్సి వస్తుంది. అలాంటి వారికి జిల్లా విద్యాశాఖ ఎలాంటి వసతి, భోజన సదుపాయం కల్పించడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని భోజన, వసతి కల్పించాలి.
– వి. గోవిందరాజులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు

ఏళ్ల డిమాండ్‌ను నెరవేర్చారు

ఏళ్ల డిమాండ్‌ను నెరవేర్చారు